తెలంగాణలో ఆ నాలుగు చోట్లే కరోనా తీవ్రత: జిల్లాల్లో సింగిల్ డిజిట్: కళ్లెం పడినట్టేనా?

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా కొత్త కేసులు భారగా తగ్గాయి. కరోనా మరణాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేలకు పడిపోయింది. కొత్త కేసుల పెరుగుదలలో వేగం మందగించింది. బ్రిటన్ నుంచి స్వస్థలానికిక చేరుకున్న వారిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించినప్పటికీ.. స్ట్రెయిన్ ఉందా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు చెబుతున్నారు. వారి నమూనాలను సీసీఎంబీకి పంపించారు.

205కే లిమిట్..

205కే లిమిట్..


తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 205 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మరణించారు. 551 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,85,068కి చేరుకుంది. ఇందులో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,77,304 మంది ఉన్నారు. 1,533 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు ఆరు వేలకు క్షీణిస్తున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 6,231 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 4,136 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

గ్రేటర్ సహా..

గ్రేటర్ సహా..

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రమే రెండంకెలను అందుకున్నాయి. మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే కరోనా వైరస్ కొత్త కేసులు పరిమితం అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ.

జిల్లాల్లో భారీగా తగ్గిన కేసులు..

జిల్లాల్లో భారీగా తగ్గిన కేసులు..

ఆదిలాబాద్-2, భద్రాద్రి కొత్తగూడెం-5, జగిత్యాల-4, జనగామ-4, జయశంకర్ భూపాలపల్లి-3, జోగుళాంబ గద్వాల-5, కరీంనగర్-13, ఖమ్మం-5, కొమరంభీమ్ ఆసిఫాబాద్-3, మహబూబ్‌నగర్-1, మహబూబాబాద్-3, మంచిర్యాల-6, మెదక్-2, మేడ్చల్ మల్కాజ్‌గిరి-9, ములుగు-3, నాగర్ కర్నూల్-5, నల్లగొండ-5, నిర్మల్-3, నిజామాబాద్-6, పెద్దపల్లి-4, రాజన్న సిరిసిల్ల-2, రంగారెడ్డి-15, సంగారెడ్డి-8, సిద్ధిపేట్-5, సూర్యాపేట్-4, వికారాబాాద్-3, వనపర్తి-1, వరంగల్ రూరల్-7, వరంగల్ అర్బన్-10, యాదాద్రి భువనగిరి-5కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి, నారాయణ్‌పేట్ జిల్లాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

సీసీఎంబీకి శాంపిళ్లు..

సీసీఎంబీకి శాంపిళ్లు..

తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 27,244 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 67,50,954గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1,81,379 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో మొత్తం 20 మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. అవి కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించినవా? కావా? అనేది తేలాల్సి ఉంది. వారి నమూనాలను సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+