తెలంగాణలో లక్షన్నరకు చేరువగా: వైరస్ కేసుల్లో అదే జోరు: గ్రేటర్ సహా జిల్లాల్లో వందల్లో

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే వస్తోంది. దాని ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతూనే ఉంది. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకవంక డిశ్చార్జిల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా మొత్తం ఇతర జిల్లాల్లో కొత్తగా నమోదవుతోన్న కేసులు పెరుగుతున్నాయే తప్ప ఆశించిన స్థాయిలో తగ్గట్లేదు. పూర్తిగా తగ్గుముఖం పట్టట్లేదు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2479 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 2485 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,47,642కు చేరుకుంది. ఇందులో 1,15,072 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 916కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 31,654గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 24,741 మంది చికిత్స పొందుతున్నారు.

 Telangana: 2479 Covid19 positive cases and 10 deaths reported in last 24 hours

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 322 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. ఆదిలాబాద్-31, భద్రాద్రి కొత్తగూడెం-83, జగిత్యాల-79, జనగామ-35, జయశంకర్ భూపాలపల్లి-14, జోగుళాంబ గద్వాల-23, కామారెడ్డి-94, కరీంనగర్-120, ఖమ్మం-94, కొమరంభీమ్ ఆసిఫాబాద్-24, మహబూబ్ నగర్-40, మహబూబాబాద్-67, మంచిర్యాల-67, మెదక్-34, మేడ్చల్ మల్కాజ్‌గిరి-183, ములుగు-22, నాగర్ కర్నూలు-54, నల్లగొండ-108, నారాయణపేట్-14, నిర్మల్-43, నిజామాబాద్-101, పెద్దపల్లి-71, రాజన్న సిరిసిల్ల-67, రంగారెడ్డి-188, సంగారెడ్డి-64, సిద్ధిపేట్-88, సూర్యాపేట్-96, వికారాబాాద్-16, వనపర్తి-33, వరంగల్ రూరల్-34, వరంగల్ అర్బన్-124, యాదాద్రి భువనగిరి-46 కేసులు నమోదు అయ్యాయి.

కరోనా వైరస్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోసారి 60 వేల వరకు టెస్టులను నిర్వహించారు. కొత్తగా వ్యాప్తంగా 62,649 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 18,90,554కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 50,922 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+