హైదరాబాద్ మెట్రో రైల్ పై తీపి కబురు..!!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఫేస్ 2 కోసం 125 కోట్ల రూపాయల పరిపాలన నిధులను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీకి మెట్రో రైలు సేవలను అందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. జాయింట్ వెంచర్ గా ఇది కార్యరూపం దాల్చబోతోంది.

19,579 కోట్ల రూపాయలతో ఫేస్ 2 (బీ) కారిడార్ నిర్మాణ పనులకు రేవంత్ ప్రభుత్వం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫేస్- 2 (బీ) కోసం జాయింట్ వెంచర్ గా నిధులను సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 5,874 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే మొత్తంలో అధికశాతం వాటా ప్రభుత్వానిదే. 30 శాతం వాటా పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం నుండి 3,524 కోట్ల రూపాయలను తీసుకోనుంది. కేంద్రం వాటా 18 శాతం.

Telangana Approves Rs 125 Crore for Hyderabad Old City Metro Connectivity

జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఎన్డీబీ నుంచి 9,398 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఆయా బ్యాంకులన్నింటి వాటా 48 శాతంగా ఉంటుంది. ఇక పబ్లిక్- ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కింద 783 కోట్ల రూపాయలను సేకరిస్తుంది. పీపీపీ వాటా నాలుగు శాతంగా నిర్ధారించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఈ నిధులతో పాతబస్తీ, దాని పరిసర ప్రాంతాలలో మెట్రో పనులను చేపడుతుంది.

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 పాతబస్తీ కారిడార్‌లోని ప్రాథమిక పనులు జనవరి మొదటి వారంలో మొదలయ్యాయి. 5.5 కిలోమీటర్ల ఈ కారిడార్‌ను మెరుగైన కనెక్టివిటీకి కల్పించేలా ప్రణాళిక చేశారు. ఇంజినీరింగ్ రీడిజైన్, పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభావితం అయ్యే ఆస్తుల సంఖ్య 1,100 నుండి దాదాపు 900కు తగ్గింది. పాలనాపరమైన అనుమతులు, నిధులు మంజూరు కావడంతో ఈ పనులు ఇక మరింత వేగం పుంజుకోనున్నాయి.

ఈ మెట్రో మార్గం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి చంద్రాయణగుట్ట వరకు కనెక్టివిటీ కల్పిస్తుంది. దారుల్ షిఫా, పురానీ హవేలీ, ఎతేబార్‌చౌక్, ఆలీజా కోట్ల, మీర్ మోమిని డేరా, హరిబౌలి వంటి కీలక ప్రాంతాల గుండా వెళుతుంది. ప్రాజెక్టు పనుల కోసం అవసరమైన భూసేకరణ, రోడ్ల వెడల్పు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం పిల్లర్ మార్కింగ్, జియోటెక్నికల్ పరిశోధనలు వంటి ప్రాథమిక పనులు పురోగతిలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+