తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం కసరత్తు
మార్చి 8 లేదా 10వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రాంభమవుతాయి. శాసన సభలో ప్రవేశ పెట్టనున్న 2017-18 వార్షిక బడ్టెట్ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
హైదరాబాద్: మార్చి 8 లేదా 10వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రాంభమవుతాయి. శాసన సభలో ప్రవేశ పెట్టనున్న 2017-18 వార్షిక బడ్టెట్ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
దీనికి రూపం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల వరుసగా రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించారు. ఆదివారం నాడు ప్రగతి భవన్లో జరిగిన బడ్జెట్ సమీక్షలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.

అన్ని శాఖల ప్రతిపాదనలు, అంచనాలపై సుదీర్ఘంగా చర్చించారు. మార్చి 8న లేదా 10న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని అంటున్నారు. బడ్జెట్‌పై శని, ఆదివారాలు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాగా, అంతకుముందు మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని భావించారు.












Click it and Unblock the Notifications