Telangana Assembly election Exit polls 2023: తెలంగాణలో కుర్చీ కిస్కా..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలేంటి..?
హైదరాబాద్ : తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఇక ఓటర్ల నిర్ణయం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమై ఉంది. అన్ని పార్టీలు తమదంటే తమదే గెలుపని చెబుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ప్రధాన పోటీ అధికారిక బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే కొనసాగింది. ఈసారి యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు.పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందనే దానిపై పలు సర్వే సంస్థలు చేసిన సర్వేలను బయటపెడుతున్నాయి. అయితే ఆ సంస్థలు ఇచ్చే ఫలితాలు వాస్తవమైనవని చెప్పలేం కానీ ఇంచుమించు దగ్గరగా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు.
తెలంగాణతో పాటుగా ఇతర నాలుగు రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్,మిజోరాం రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా నేడు విడుదలవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఒక క్లారిటీ రానుంది. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.













Click it and Unblock the Notifications