తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ఇదేనా?

హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాలు మినహా తమ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. బీజేపీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను అక్టోబర్ నెలలో ప్రకటించే అవకాశం ఉంది.

ఏకాభిప్రాయం కుదిరిన 40 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపింది. ఈ జాబితాను జాతీయ నాయకత్వం పరిశీలించిన తర్వాత స్వల్ప మార్పులతో అక్టోబర్ 15 లేదా 16న 38 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Telangana assembly elections: BJP first list may like this.

కాగా, బీజేపీ తొలి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిచిన పలువురు పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. బీజేపీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ పేర్లే దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు.

కరీంనగర్: బండి సంజయ్
హుజూరాబాద్: ఈటల రాజేందర్
ముషీరాబాద్ నుంచి బండారు విజయలక్ష్మి
సనత్‌నగర్: మర్రి శశిధర్ రెడ్డి
ఉప్పల్: ఎన్వీఎస్ ప్రభాకర్
మల్కాజిగిరి: రాంచందర్ రావు
ఖైరతాబాద్: చింతల రామచంద్రారెడ్డి
గోషామహల్: విక్రమ్ గౌడ్
మహేశ్వరం: అందెల శ్రీరాములు యాదవ్
సికింద్రాబాద్: బండ కార్తీక రెడ్డి
కల్వకుర్తి: తల్లోజు ఆచారి
గద్వాల: డీకే అరుణ

Telangana assembly elections: BJP first list may like this.

మహబూబ్ నగర్: జితేందర్ రెడ్డి
తాండూరు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం: బూర నర్సయ్య గౌడ్
కుత్బుల్లాపూర్: కూన శ్రీశైలం గౌడ్
భువనగిరి: గూడురు నారాయణ రెడ్డి
ఆలేరు: కాసం వెంకటేశ్వర్లు
చొప్పదండి: బొడిగే శోభ
వరంగల్ తూర్పు: ఎర్రబెల్లి ప్రదీప్ రావు
భూపాలపల్లి: చందుపట్ల కీర్తి రెడ్డి
వేములవాడ: చెన్నమనేని వికాస్ రావు

ఆదిలాబాద్: పాయల్ శంకర్
బోథ్: సోయం బాపూరావు
ఆర్మూర్: ధర్మపురి అరవింద్
మనుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సూర్యపేట: సంకినేని వెంకటేశ్వర్లు
పరకాల: గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
దుబ్బాక్: రఘునందన్ రావు
వర్ధన్నపేట: కొండేటి శ్రీధర్
మహబూబాబాద్: హుస్సేన్ నాయక్
నర్సంపేట: రేవూరి ప్రకాశ్ రెడ్డి
నిర్మల్: మహేశ్వర్ రెడ్డి
స్టేషన్ ఘన్ పూర్: విజయరామారావు
రాజేంద్రనగర్: తోకల శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ పశ్చిమ: ఏనుగుల రాకేశ్ రెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+