తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు2023: బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో తెలిపిన మల్లు రవి
Mallu Ravi: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకాస్సేపట్లో వెల్లడి కానున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ఆరంభమౌతుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కూడా నేడే ఫలితాలు వెలువడనున్నాయి. మిజోరం ఎన్నికల ఓట్ల లెక్కింపును కూడా ఇవ్వాళే చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్ర రాజకీయ నాయకుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రక్రియను సోమవారానికి వాయిదా వేసింది కేంద్రం ఎన్నికల కమిషన్.

తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన విషయం తెలిసిందే. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ హంగ్ వైపు మొగ్గు చూపాయి. అంతే గానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా స్పష్టం చేయలేదు. హస్తం పార్టీకి భారీ మెజారిటీని అందించాయి.
ఫలితంగా- కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ నాయకులందరూ సంబరాలు చేయడానికి సన్నద్ధం అయ్యారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోందనే సంకేతాలు కూడా అందుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించిన స్థాయిలో తమకు సీట్లు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 75 నుంచి 95 స్థానాలతో తాము అధికారంలోకి రాబోతోన్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఓటర్లు తమకు పట్టం కట్టారని, తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
భారత్ రాష్ట్ర సమితికి ఎన్ని సీట్లు లభిస్తాయనేదీ ఆయన వివరించారు. గులాబీ పార్టీకి 15 నుంచి 20 కంటే ఎక్కువ సీట్లు రాబోవని మల్లు రవి అన్నారు. కేసీఆర్ పది సంవత్సరాల అహంకారపూరిత పరిపాలన సాగించారని, ప్రజలు విసిగిపోయారని విమర్శించారాయన. తాము సంక్షేమ పాలన అందిస్తామని పేర్కొన్నారు. బీజేపీకి ఆరు లేదా ఏడు సీట్లకే పరిమితమౌతుందని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications