తెలంగాణపై రేణుకా చౌదరి ఏం చెప్పారు?: ఏం జరుగుతోంది?

Renuka Chowdhury: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా కొనసాగుతోంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే దూకుడును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనసాగించింది హస్తం పార్టీ. తొలి గంటలోనే పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్‌ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది.

 Telangana Assembly elections results 2023: we tapped the public pulse, says Renuka Chowdhury

ఆ తరువాత ఆధిక్యత చేతులు మారుతూ వచ్చింది. 70 స్థానాల్లో కనిపించిన కాంగ్రెస్ ఆధిక్యత 62కు పడింది. 35 నియోజకవర్గాలకు పరిమితమైన భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు 42 చోట్ల ఆధిక్యతను సాధించారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. అయిదు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఆధిక్యతను పెంచుకోగలిగింది. తొలుత మూడు చోట్ల లీడింగ్‌లో ఉన్న కమలం పార్టీ అభ్యర్థులు ఆ తరువాత ఎనిమిది చోట్ల పైచేయి సాధించారు.

సంపూర్ణ మెజారిటీ సాధించే దిశగా కాంగ్రెస్ అడుగులు పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. పెద్ద ఎత్తున ఉత్సవాలు మొదలు పెట్టేశారు. బాణాసంచా కాల్చుతూ సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ సహా జిల్లా కార్యాలయాల్లో సందడి నెలకొంది.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామనే విషయాన్ని ఏడాది కాలంగా చెబుతూ ఉన్నానని అన్నారు. ప్రజల నాడిని తాము పట్టుకోగలిగామని వివరించారు. బీఆర్ఎస్ పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్‌ను గానీ బీజేపీని గానీ తెలంగాణ సమాజం కోరుకోవట్లేదని రేణుకా చౌదరి చెప్పారు. మజ్లిస్‌తో బీఆర్ఎస్ చెట్టాపట్టాలు వేసుకోవడాన్ని ప్రజలు హర్షించట్లేదనే విషయం ఈ ఓటింగ్‌తో స్పష్టమైందని అన్నారు. మజ్లిస్ అత్యంత ప్రమాదకర పార్టీగా ఆమె అభివర్ణించారు.

ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు ఘోర పరాభవం తప్పదని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్- మజ్లిస్ దోస్తీని ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో దేశాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని తెలంగాణ ప్రజలు గ్రహించారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+