Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం కొత్త చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం!

తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరోసారి రాజకీయ యుద్ధం మొదలైంది. దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు అండగా ఉన్న 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం' (MGNREGA) స్థానంలో కేంద్రం ప్రతిపాదించిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం కీలక తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పేరును మార్చడమే కాకుండా, దాని రూపురేఖలను మారుస్తూ 'వికసిత్‌ భారత్‌- గ్యారెంటీ ఫర్‌ గ్రామీణ్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌' (VB-GRAM-G) పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది.

"పేదల పొట్ట కొట్టే విధంగా ఉన్న ఈ కొత్త విధానాన్ని మేము అంగీకరించం. ఉపాధి హామీ అనేది పేదలకు ఒక 'హక్కు'. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది" అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు.

Telangana Assembly Passes Resolution Opposing Centre New Rural Employment Law

బీఆర్ఎస్ 'వాకౌట్'.. సీతక్క విమర్శలు!
ఈ అంశంపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేస్తూ బయటకు వెళ్లిపోయింది. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బి-టీమ్‌లా వ్యవహరిస్తోంది. మోదీ మెప్పు కోసమే వారు ఉపాధి హామీ చర్చలో పాల్గొనకుండా పారిపోయారు. పేదలకు పని ఇచ్చే పథకాన్ని రద్దు చేస్తున్నా బీఆర్ఎస్ మౌనంగా ఉండటం వారి ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనం" అని సీతక్క విమర్శించారు.

బీజేపీ ఎమ్మెల్యేల ఎదురుదాడి!
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు తీవ్రంగా ఖండించారు. కేవలం ప్రధాని మోదీని తిట్టడమే పనిగా కాంగ్రెస్ సభను వాడుకుంటోందని వారు ఆరోపించారు. రాష్ట్ర సర్కారు తన వాటాగా ఇవ్వాల్సిన 40 శాతం నిధులను సమకూర్చలేక, ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టేయడానికే ఈ తీర్మానం నాటకం ఆడుతోందని బీజేపీ నేతలు విమర్శించారు. వ్యవసాయానికి మేలు చేసేలా మార్పులు చేస్తే కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని వారు మండిపడ్డారు.

తీర్మానం ప్రభావం ఏంటి?
అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి పంపనుంది. ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, పేదల హక్కులను కాలరాయవద్దని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+