వరంగల్ ఎన్‌కౌంటర్‌పై సభలో గొడవ: హరీష్ ఫైర్, పారిపోమన్న కెసిఆర్
హైదరాబాద్: వరంగల్ ఎన్‌కౌంటర్‌పై బుధవారం తెలంగాణ శాసనసభలో గందరగోళం చోటు చేసుకుంది. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై తక్షణ చర్చకు తెలుగుదేశం, వామపక్షాలు పట్టుబట్టాయి. దీంతో కాసేపు సభలో గందరగోళం చెలరేగింది. రైతు సమస్యలపై చర్చ ముగిసిన తర్వాత ఇతర విషయాలపై చర్చిద్దామని, అన్ని విషయాలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది.
రెండు రోజుల పాటు రైతుల గురించి చర్చిద్దామని అనుకున్నామని, అన్ని విషయాలపై మాట్లాడుకుందామని, అవసరమైతే సభ సమావేశాలను పొడిగించుకుందామని, ప్రభుత్వం పారిపోవాలని అనుకోవడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. దాంతో సభ సద్దుమణిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యుడు రామలింగా రెడ్డి మాట్లాడారు.
ప్రతిపక్షాలపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులపై ప్రతిపక్షాలకు ప్రేమ లేదని ఆయన అన్నారు. అన్ని విషయాలకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఎవరు రైతుల గురించి మాట్లాడదలుచుకున్నారో, ఎవరు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.

రైతు సమస్యలపై ప్రతిపక్షాలకు రైతుల పట్ల నిజాయితీ, చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. రైతులను కాపాడుకునే విధంగా చర్చించుకుందామని, లేదంటే రైతుల ప్రతిపక్షాలను తప్పు పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. రైతు సమస్యలపై టిడిపికి చర్చించడం ఇష్టం లేదని ఆయన అన్నారు. రాజకీయాలు చేయడం తప్ప రైతుల ఘోష ప్రతిపక్షాలకు పట్టడం లేదని ఆయన అన్నారు.
ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్యనే హరీష్ రావు మాట్లాడారు. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్న స్థితిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జోక్యం చేసుకుని రెండు రోజుల పాటు రైతు సమస్యలపై చర్చిద్దామని బిఎసిలో అనుకున్నామని చెప్పారు. రైతుల సమస్యలపై చర్చ ముగిసిన తర్వాత అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందామని, రైతు సమస్యలపై జరుగుతున్న చర్చల గాంభీర్యాన్ని చెడగొట్టి రైతుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయవద్దని అన్నారు
ఈ సమయంలో బిజెపి సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. రైతులపై పూర్తి స్థాయి చర్చ జరగాలనే తాము మంగళవారం వాయిదా తీర్మానం పెట్టలేదని, అయితే తామేదో రైతులకు వ్యతిరేకమన్నట్లు మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారని, సభను అడ్డుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, తాము రైతులకు వ్యతిరేమన్నట్లు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తమ వాయిదా తీర్మానానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదో అడగాలని తాము అనుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని టిడిపి సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ - రెండు రోజుల పాటు రైతు సమస్యలపై తప్ప వేరే మాట్లాడకూడదని అనుకున్నామని, సాంకేతికపరమైన విషయాలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చునని, ప్రతి విషయం మీద మాట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications