ఆటోలోకి లాగి లైంగిక దాడికి ప్రయత్నించిన డ్రైవర్ ఇతనే

మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ యువతిని ఆటోలోకి లాగి లైంగిక దాడికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను సినిమాల్లో చిన్నపాటి వేషాలు కూడా వేశాడు.

హైదరాబాద్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుతున్న 23 ఏళ్ల వయస్సు గల ఓ యువతిని తన ఆటోలోకి లాగి లైంగిక దాడికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్‌ను మంగళవారం హైదరాబాదులోని నారాయణగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎస్.భీమ్‌రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పసునూరు గ్రామపరిధిలోని నామానాయక్ తండాకు చెందిన రాజు నాయక్(25) బంజారా హిల్స్‌లోని సింగరేణి కాలనీలో నివసిస్తూ ఆటో నడుపుకుటూ జీవనం సాగిస్తున్నా డు. నారాయణగూడలోని జీఎస్ మెల్కోటే పార్కులో వాకింగ్ చేసేందుకు వచ్చిన ఓ యువతి తిరిగి ఇంటికి తన స్నేహితురాలుతో వెళ్తుండగా రాజునాయక్ ఆమెను ఆటోలోకి లాగి లైంగిక దాడికి యత్నంచాడు.

Telangana: Auto driver tries to molest woman

గట్టిగా కేకలు వేయడంతో దగ్గర్లో ఉన్నవా రు రావడంతో ఆమెను వదిలివేసి ఆటోతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజు నాయక్ ను అరెస్టు చేశారు. అధికంగా ఉన్న హాస్టల్, కళాశాలలు ఉన్న ప్రాంతం లో ఈ ఘటన జరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

ఆ సంఘటన ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం జరిగింది. సిసిటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించి అరెస్టు చేశారు. దాదాపు 30 సిసిటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. యువతి మార్నింగ్ వాక్ చేస్తుండగా ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో విఠల్‌వాడీలోని మేల్కోటే పార్కు వద్ద ఆటో డ్రైవర్ ఆ ఘాతుకానికి ఒడిగట్టాడు.

ఆటో డ్రైవర్‌కు పెళ్లయింది. అతనికి ఓ బిడ్డ కూడా ఉంది. సినిమాల్లో అతను చిన్నపాటి వేషాలు కూడా వేశాడు. అతను గతంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడి ఉంటాడా అనే కోణంలో పోలీసులు పరిశీలన జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+