అక్టోబర్ 18న తెలంగాణా బంద్!
తెలంగాణ రాష్ట్రంలో రేపు 14వ తేదీన రాష్ట్ర బంద్ ను నిర్వహిస్తామని, బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు, బిసి రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 14వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ ను వాయిదా వేసినట్టు బీసీ జేఏసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణరాష్ట్ర బంద్ ను 18వ తేదీన చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం ఆందోళన ఉధృతం
తెలంగాణ రాష్ట్రంలో బిసి హక్కుల సాధన కోసం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడం కోసం చేపట్టిన ఈ ఆందోళన, బలమైన ఉద్యమంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపిస్తుందని, తద్వారా రిజర్వేషన్ల విషయంలో సవరణలు చేయవలసిన అవసరం ఉంటుందని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్ ను సక్సెస్ చేస్తే బీసీల ఐక్యత కేంద్రానికి తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీసీలు పోరాటం చేయాల్సి వస్తూనే ఉందన్న ఆర్ కృష్ణయ్య
బంద్ కు పిలుపునివ్వడం ద్వారా ప్రభుత్వం మరియు అధికారిక వ్యవస్థ దృష్టిని ఆకర్షించాలని, బీసీల యొక్క ఐక్యత ఏమిటో చాటి చెప్పాలని భావిస్తున్నామని ఆయన అన్నారు.
ఇప్పటివరకు దేశానికి స్వాతంత్రం వచ్చి 76సంవత్సరాలు గడిచినప్పటికీ బీసీలకు దక్కాల్సిన న్యాయం దక్కలేదని, ఇంకా బీసీలు పోరాటం చేయాల్సి వస్తూనే ఉందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి పూర్తిగా దక్కటం లేదని బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలను విస్మరించడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదు
బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడమే ప్రధాన సమస్య అని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లు తక్కువగా ఉండడం, బీసీలను విస్మరించడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదని, అందుకే ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
హైకోర్టు స్టే ఇవ్వడం బీసీలను మరింత అవమానించడమే
దేశంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవులలో బీసీల వాటా తక్కువగా ఉందని ముఖ్యంగా స్థానిక సంస్థలు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేక బీసీలు అణగదొక్కబడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడం బీసీలను మరింత అవమానించడమే అని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ల అంశం పైన హైకోర్టు స్టే ఇవ్వడం న్యాయం కాదని ఆయన అన్నారు.
చట్టసభల్లో బిల్లు పెట్టేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం
ఈ అవమానాన్ని తమ భరించలేకపోతున్నామని అందుకే చట్టసభల్లో బిల్లు పెట్టేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. బీసీ జేఏసీ పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువెళతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీల కోసం చట్టపరమైన చర్యల కోసం ఒత్తిడి తీసుకురావాలని బీసీ జేఏసీ నేతలు భావిస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications