మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ - లిక్కర్ అమ్మకాలు బంద్..!!
మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్. తెలంగాణ వ్యాప్తంగా బార్ల బంద్ కు నిర్ణయించారు. ఈ మేరకు బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ప్రివిలైజ్ సెస్సుకు వ్యతిరేకంగా ఈనిర్ణయం తీసుకుంది. ఈ సెస్సును వెనక్కు తీసుకోవాలని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఒక్కొక్క బార్ నుంచి ఎనిమిది నుంచి ఇరవై శాతం వరకూ సెస్సు ఏటా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ బంద్ చేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో బార్ల బంద్ పైన అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ప్రివిలైజ్ సెస్సు తమకు అదనపు భారంగా మారుతుందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రివిలేజ్ ఫీజును 8 శాతం నుంచి ఏకంగా 20 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజు పెంపు వల్ల ఒక్కో బార్‌పై అదనంగా మరో రూ.30 లక్షల వరకు భారం పడుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా పెంచిన ప్రివిలేజ్ ఫీజు, లైసెన్స్ ఫీజుల జీవోను తక్షణమే రద్దు చేయాలని బార్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. బార్ల వార్షిక లైసెన్స్ ఫీజు పేరుతో ప్రతిఏటా ప్రభుత్వానికి 33 లక్షల నుంచి 56 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో
కాగా.. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే రద్దు చేయాలని లేదంటే.. లేదంటే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. వైన్ షాపుల వద్ద శాశ్వత పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వటం ద్వారా తమ వ్యాపారం ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు. తాము కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రివిలేజ్ సెస్ పేరిట అదనపు భారాన్ని మోపడం అన్యాయమని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఈ డిమాండ్ల పైన ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది.












Click it and Unblock the Notifications
