మేము గెలవమని ముందే తెలుసు.. తెలంగాణ బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్ !
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపు వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతుండగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. బీజేపీ పూర్తిగా వెనుకంజలో ఉంది.
అయితే ఈ లెక్కింపు ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఈ ఎన్నికల్లో గెలవమని ముందే తెలుసని హాట్ కామెంట్స్ చేసారు. కేవలం ప్రాతినిధ్యం వహించడానికే తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రారంభంలో భాగంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 15 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 9 ఓట్లు వచ్చాయి. ఇక ఇక పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు పూర్తైన తరుణంలో అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) లెక్కింపును ప్రారంభించారు. ఈవీఎంల సీల్స్‌ను తెరచి, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.
ఇప్పటికే నాలుగు రౌండ్లు పూర్తి అవ్వగా ప్రధాన అభ్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రౌండ్‌లో నవీన్‌యాదవ్‌కు 8,911 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు లభించాయి. రెండో రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు 9,691 ఓట్లు, మాగంటి సునీతకు 8,609 ఓట్లు వచ్చాయి.
మూడో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 28,956 ఓట్లు పోలవగా.. సునీతకు 22,962 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 5341 ఓట్లు సొంతం చేసుకున్నారు.

అలానే నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి నవీన్ యాదవ్‌కు 42,126 ఓట్లు.. మాగంటి సునీతకు 33,979 ఓట్లు, దీపక్ రెడ్డి 6,856 ఓట్లు సాధించారు. అయితే ఓట్ల లెక్కింపులో బీజేపీ పూర్తిగా వెనకబడిపోగా ఓట్ల లెక్కింపు వద్ద ఆ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఎవరూ లేకపోవడం గమనార్హం.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications