బీజేపీ ముఖ్య నేతలకు అధిష్ఠానం పిలుపు - కీలక మలుపు..!!

తెలంగాణ కేంద్రంగా బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్య నేతలకు ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న వేళ వచ్చే ఎన్నిక లే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ బన్సాల్ సైతం తెలంగాణ నేతలకు బిగ్ టాస్క్ ఫిక్స్ చేసారు. త్వరలో గ్రేటర్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక నుంచే ఆపరేషన్ 2028 ప్రారంభించాలని బీజేపీ డిసైడ్ అయింది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ముఖ్య నేతలు తెలంగాణ పైన ఫోకస్ చేసారు. కీలక నేతలు రాష్ట్రంలో పర్యటించేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసారు. ఇక.. రాష్ట్ర ఇంఛార్జ్ బన్సాల్ పార్టీ నేతలకు హైకమాండ్ ఆలోచన ఏంటో తేల్చి చెప్పారు. పని చేయని నేతలు పదవుల్లో నుంచి తప్పుకోవాలని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ కీలక నేతలకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌లు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో వారు వేర్వేరుగా సమావేశం కానున్నట్లు సమాచారం. వచ్చే నెలలో అమిత్ షా.. డిసెంబర్ లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు.

మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు, ఆయనకే ఛాన్స్- తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు, ఆయనకే ఛాన్స్- తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
telangana-bjp-key-leaders-summoned-by-high-command-major-changes-likely-here-the-reports

అదిష్ఠానం దిశా నిర్దేశం

ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలకు పిలుపు రావటం ఆసక్తిగా మారుతోంది. రాష్ట్రంలో చేపట్టనున్న కార్యక్రమాలు.. లోక్ తంత్ర్ బచావో ... అరాచక్ హటావో కార్యక్రమం, పార్టీ సంస్థాగత మార్పులు, రాష్ట్ర రాజకీయ పరిణామాలతోపాటు స్థానికంగా పార్టీ మరింత బలోపేతం కావడం కోసం అనుస రించాల్సిన వ్యూహంపై తెలంగాణ నేతలకు వారు దిశ నిర్దేశం చేయనున్నారని సమాచారం. అదే విధంగా గ్రామ స్థాయిలో పార్టీని పటిష్ఠ పరిచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. అలాగే మిగిలిన ప్రాంతంలో కూడా పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా అధికారం అందుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కాగా.. ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అలాంటి వేళ.. కాంగ్రెస్.. బీఆర్ఎస్ కు ధీటుగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం పైన వీరికి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+