కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్: సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ. 3 లక్షలు
సోమవారం ఉదయం తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సొంత జాగా ఉండి.. ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున శుభవార్త చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌లో పలు కీలక కేటాయింపులు వెల్లడించారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. సోమవారం ఉదయం ఆయన తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సొంత జాగా ఉండి.. ఇల్లు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం తరపున శుభవార్త చెప్పారు.
సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీని కోసం రూ. 7,890 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో 2 వేల మందికి రూ. 3 లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి ప్రకటించారు. సీఎం కోటాలో 25 వేల మందికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మొత్తంగా రెండు లక్షల 63వేల మందికి రూ. 7890 కోట్లు అందించనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
మరోవైపు, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ. 12వేల కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. విద్య, వైద్యానికి ఎప్పటిలాగే ప్రాధాన్యత ఇచ్చింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు పథకాలకు భారీగా నిధులు కేటాయించింది.
మొత్తం బడ్జెట్ చూసుకున్నట్లయితే: రూ. 2,90,396 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ. 2,11,685 కోట్లు
పెట్టుబడి వ్యయం: రూ. 37,525 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ. 4,834 కోట్లు
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12,000 కోట్లు

విద్యాశాఖకు రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1463 కోట్లు..
రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు పథకానికి రూ. 15,075 కోట్లు
రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 3,210 కోట్లు
దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications