పవన్ కల్యాణ్‌కు ఆ మాత్రం కూడా తెలియదా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణ క్యాబ్ అసోషియన్స్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్‌లో తిరగనివ్వాలన్న పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ క్యాబ్ అసోషియన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోటార్ వాహన చట్టం తెలియకుండా మాట్లాడుతున్నారని పవన్ తీరును ఎండగట్టారు. మోటార్ వాహన చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల వాహనాలు అనుమతి లేకుండా మరో రాష్ట్రంలో తిరగకూడదన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం పర్మిట్ లేకుండా ఇక్కడ వాహనాలు నడపటం నేరమని చెప్పారు.
మోటరు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించడం సరైన విషయంకాదనే విషయనాన్ని ఈ సందర్భంగా పవన్‌కు గుర్తు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన క్యాబ్ డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టులో కొందరు ఓకే వాహనానికి ఏపీ, తెలంగాణ రెండు నెంబర్ ప్లేట్లతో వాహనాలు నడుపుతున్నారు. ఈ విషయంపై తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు.. ఏపీ క్యాబ్ డ్రైవర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఏపీ క్యాబ్ డ్రైవర్లను తెలంగాణలో రావొద్దని తేల్చి చెప్పేశారు. ఈ ఘటన తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఏపీ క్యాబ్ డ్రైవర్లు తమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ..హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు పదేళ్లు పూర్తి కాగానే.. ఏపీ క్యాబ్ డ్రైవర్లను తెలంగాణ డ్రైవర్లు నగరంలో అడ్డుకోవటం సరైంది కాదని పవన్ కల్యాణ్ తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సఖ్యత ఉండాలని పవన్ కల్యాణ్ కోరారు. ఏపీలో రాజధాని పనులు మొదలు కాగానే ఇక్కడే డ్రైవర్లకు మెరుగైన ఉపాధి దొరుకుతుందని ఆయన చెప్పుకొచ్చారు. సాటి డ్రైవర్లకు మానవతా దృక్పథంతో తెలంగాణ డ్రైవర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని ఏపీ డ్రైవర్లకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీంతో తాజాగా తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు స్పందించి పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రవాళ్లకు పని కల్పించి , తాము పస్తులు పడుకోవాలా అంటూ తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications