తెలంగాణ బడ్జెట్ రూ.2.95 లక్షల కోట్లు: ఆ రెండింటికీ అధిక వాటా- ఓకే చెప్పిన రేవంత్: పండగే

Telangana Budget 2024: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటోన్నారు. ఒకరి పాలన లోపాలను మరొకరు ఎత్తి చూపుతోన్నారు. ఘాటు విమర్శలను సంధించుకుంటోన్నారు.

అదే సమయంలో- ఆర్థిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిపాదనలు సభకు సమర్పించనున్నారు. ఈ నెల 27వ తేదీన బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. 29, 30, 31వ తేదీల్లో పలు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేకించి- ద్రవ్యవినిమయ బిల్లు 31వ తేదీన సభ ముందుకు రానుంది.

Telangana cabinet approved for Rs 2 95 lakh Crore Budget Proposals

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టబోతోన్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సందరించుకుంది. గతంలో రేవంత్ సర్కార్.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.

బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించడానికి తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. రేవంత్ రెడ్డి.. దీనికి అధ్యక్షత వహించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ యధాతథంగా ఆమోదం తెలిపింది. ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులకూ పూనుకోలేదు.

ఈ బడ్జెట్ ప్రతిపాదనల విలువ 2.95 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో అధిక వాటా ఆరు గ్యారంటీలకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వాటిని అమలు చేయడానికి 75,000 కోట్ల రూపాయల వరకు నిధులను కేటాయిస్తారని సమాచారం. ఇందులో కూడా వ్యవసాయ మంత్రిత్వ శాఖకే అధిక మొత్తం ఉంటుందని అంటున్నారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సబ్సిడీ కింద ఎరువులు, విత్తనాల పంపిణీ, వ్యవసాయ పనిముట్లల్లో రాయితీలను కల్పించడం, పంట రుణాలు, తుఫాన్ బాధిత రైతులకు సకాలంలో నిధులను మంజూరు చేయడానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్లు చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క.. బడ్జెట్‌ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+