తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజాపాలన వారోత్సవాల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు. మొదట గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. పంచాయతీలకు ఇచ్చే నిధులు మార్చిలోగా ఉపయోగించుకోవాలని సూచించారు.
స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఇవాళ జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు చూస్తే..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతో గతంలో మంత్రి మండలి తీర్మానం చేయడం, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ గారి వద్ద పెండింగ్ లో ఉండటం, కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించడం, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన పరిణామాలను మంత్రివర్గం సమగ్రంగా.. సుదీర్ఘంగా చర్చించింది. ఈ విషయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఎన్నికలు నిర్వహించని పక్షంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావలసిన దాదాపు 3 వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుందని, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించిందని అన్నారు. అందులో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, న్యాయస్థానాల్లో ఈ విషయం తేలిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని మంత్రిమండలి భావించిందన్నారు. బీసీలకు పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఫోర్త్ సిటీలో నిర్వహించాలని, అలాగే, డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ సేవలను స్మరిస్తూ మంత్రిమండలి తీవ్ర సంతాపం తెలియజేసిందని.. రాష్ట్ర ప్రజలకు వారందించిన జయ జయహే తెలంగాణ.. రాష్ట్ర గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో ప్రచురించాలని కేబినేట్ తీర్మానించిందని వివరించారు. అలాగే అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని ఒక స్మృతివనంగా తీర్చిదిద్దాలని తీర్మానించినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణ ప్లాట్ ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అలాగే SRSP స్టేజ్-2కు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పారిశ్రామిక భూమిని మల్టీ యూజ్ జోన్స్ గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications