ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల డీఏ, కాళేశ్వరం కమిషన్ విచారణ, NDSA నివేదికపై, బనకచర్ల అంశంపై చర్చ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ కీలక నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉండగా, రెండు డీఏలను ఉద్యోగులకు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించారు. అలాగే మెట్రో ఫేజ్ -2 విస్తరణకు కూడా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ రోడ్ల ఆధునీకరణ మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించారు.
మహిళా స్వయం సహాయక బృందాలకు బీమా కల్పించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ములుగు జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సీఎంకు మంత్రులు వివరించారు.

కాళేశ్వరం కమిషన్ విచారణ, NDSA నివేదిక వంటి అంశాలపై చర్చించడం ద్వారా ప్రభుత్వ పారదర్శకంగా జరగాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రామీణ రోడ్ల ఆధునీకరణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రమాద, లోన్ బీమా చెల్లింపునకు రూ.70 కోట్లు కేటాయించారు.ములుగు జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమి కేటాయించారు.












Click it and Unblock the Notifications