Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలు ఇవే..!
తెలంగాణ కేబినెట్ సమావేశం జూలై 17 న జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో కరవు పరిస్థితులు, కాళేశ్వరం, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టులు అలాగే కీలక బిల్లులపై చర్చించనుంది. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టుల రీ-ఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంపై సమీక్షించనున్నారు. కరవును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. వీటితోపాటు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు,కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ పై చర్చించనున్నారు.

అలాగే రాష్ట్రంలో సరికొత్త 'మున్సిపల్ చట్టాన్ని' ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఈ నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాపై కేబినెట్ లో చర్చించి.. దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ కీలక మార్పులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.












Click it and Unblock the Notifications