కేసీఆర్ ఆస్తులు, అప్పులు ఎంతో తెలుసా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం నామినేషన్ వేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కామారెడ్డి నుంచి కూడా ఈసారి కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఈ రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తన పేరిట రూ. 58.7 కోట్ల ఆస్తులు ఉన్నాయని కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నామినేషన్ వేసే నాటికి కేసీఆర్ చేతిలో రూ. 2,96,605 నగదు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్, టెర్మ్ డిపాజిట్లు వంటి అన్ని ఖాతాలలో కేసీఆర్‌కు రూ. 11,16,25,887 ఉన్నట్లు చూపించారు.

కేసీఆర్ భార్య శోభకు బ్యాంకులలో రూ. 6,29,08,404 ఉన్నాయి. తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రూ. 2,31,00,000 విలువైన వాటాలు.. తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 4,16,25,000 విలువైన వాటాలు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
అయితే, కేసీఆర్ పేరిట వాహనాలేమీ లేవు. మొత్తం రూ. 17,40,000 విలువ చేసే 3 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు ఆయన వద్ద ఉన్నాయి. శోభ పేరిట 2,841 గ్రాముల (2 కేజీల 800 గ్రాముల) బరువైన బంగారు ఆభరణాలున్నాయి. 45 కేజీల వెండి వస్తువులున్నాయి. వీటన్నిటి మొత్తం విలువ రూ. 1,49,16,408గా పేర్కొన్నారు.
మొత్తంగా కేసీఆర్ పేరిట చరాస్తులు రూ. 17,83,87,492 ఉండగా, ఆయన భార్య శోభ పేరిట రూ. 7,78,24,488 ఉన్నాయి. ఇక, కేసీఆర్ హిందూ అవిభాజ్య కుటుంబానికి రూ. 9,81,19,820 మేర చరాస్తులున్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే కేసీఆర్ పేరిట రూ. 8.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా ఆయన భార్య పేరిట ఏమీ లేవు. కేసీఆర్ దంపతులకు స్థిర, చరాస్తులన్నిటి మొత్తం విలువ రూ. 58,93,31,800. మొత్తం అప్పులు రూ. 24,51,13,631 ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications