సిఎం, గవర్నర్లకు మఠాధిపతి ఆశీస్సులు (ఫొటోలు)

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం హైదరాబాదులోని డిడి కాలనీలో గల ఆహోబిల మఠాన్ని సందర్శించారు. 46వ అహోబిల మఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంధ్ర మహదేశికన్ తిరునక్షత్రాన్ని (జన్మదినోత్సవం) పురస్కరించుకొని మఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఆయన ఆశీస్సులు అందజేశారు.

అహోబిలానికి స్వయంగా వచ్చి నరసింహస్వామి ఆశీస్సులు పొందాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఈ సందర్భంగా మఠాధిపతి సూచించారు. అలాగే హైదరాబాద్‌లో అహోబిల మఠం నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయించాలని మఠాధిపతి కోరగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించారు.

పీఠాధిపతికి కెసిఆర్ పూలమాలలు, శాలువాలు సమర్పించి సత్కారం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మహాదేశికన్ ఆశీర్వదించారు. ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామికి కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు.

అహోబిల మఠంలో కెసిఆర్

అహోబిల మఠంలో కెసిఆర్

గవర్నర్ నరసింహన్‌తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారంనాడు హైదరాబాదులోని అహోబిల మఠాన్ని సందర్శించారు.

అహోబిల మఠంలో కెసిఆర్

అహోబిల మఠంలో కెసిఆర్

అహోబిల మఠం మందిర పూజారి రాఘవన్‌తో పాటు వేద పండితులు కెసిఆర్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

నరసింహన్ అహోబిల మఠంలో

నరసింహన్ అహోబిల మఠంలో

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కలిసి గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని అహోబిల మఠాన్ని సందర్శించారు.

కెసిఆర్, గవర్నర్ ఇలా..

కెసిఆర్, గవర్నర్ ఇలా..

హైదరాబాదులోని అహోబిల మఠంలో ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నరసింహన్ ఇలా కనిపించారు.

మఠాధిపతి ఆశీస్సు

మఠాధిపతి ఆశీస్సు

అహోబిల మఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు మఠాధిపతి మహాదేశికన్ ఆశీస్సులు అందజేశారు.

ప్రత్యేక పూజలు

ప్రత్యేక పూజలు

అహోబిల మఠంలోని లక్ష్మీనరసింహ స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు.

సత్కారం చేశారు..

సత్కారం చేశారు..

అహోబిల మఠం పీఠాధిపతి మహాదేశికన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పూలమాలలు, శాలువాలు సమర్పించి సత్కారం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+