Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"కారు" లేని గులాబీ రథసారథి..! కేసీఆర్ ఆస్తులెంత? అప్పులెంత?

Recommended Video

    Telangana Elections 2018 : కేసీఆర్ ఆస్తులెంత? అప్పులెంత? | Oneindia Telugu

    కారు ఓనర్ కు వాహనం లేదంటే ఆశ్చర్యమే కదా. ఇది వినడానికి వింతగా ఉన్నా అక్షరాలా నిజం. అసలు విషయానికొస్తే గులాబీ రథ సారథి కేసీఆర్ కు కారు లేదంట. తనకు సొంత వాహనాలంటూ ఏమీ లేవని అఫిడవిట్ కూడా ఇచ్చారు. బుధవారం గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు దాఖలు చేసిన నామినేషన్ తో పాటు సమర్పించిన ప్రమాణపత్రంలో ఈ విషయం పేర్కొన్నారు.

    ఆస్తుల విలువ మొత్తం 22 కోట్ల 60 లక్షలని చూపించిన కేసీఆర్.. 8కోట్ల 88 లక్షల వరకు అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా ఫామ్-26తో పాటు ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు అఫిడవిట్‌లో పొందుపరిచారు. తనకు ఎటువంటి సొంత వాహనాలు లేవని అందులో పేర్కొన్నారు.

    కూడబెట్టిందెంత..!

    కూడబెట్టిందెంత..!

    నామినేషన్ సందర్భంగా కేసీఆర్ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో చరాస్తుల విలువ 10,40,77,946 (10 కోట్ల 40 లక్షలు) గా చూపించారు. స్థిరాస్తుల విలువ పొలం, ఇళ్లు, ఫామ్ హౌస్ అన్నీ కలిపి 12 కోట్ల 20 లక్షలుగా పేర్కొన్నారు. తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 55 లక్షల పెట్టుబడితో పాటు.. తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 4,16,25,000 (4 కోట్ల 16 లక్షలు) పెట్టుబడి పెట్టారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 5,63,73,946 (5కోట్ల 63 లక్షలు) ఉండగా 2 లక్షల 40 వేల రూపాయల విలువ చేసే 75 గ్రాముల గోల్డ్ ఉన్నట్లు చూపించారు.

    బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఏడాదికి 99 వేల రూపాయలు కడుతున్నట్లు పేర్కొన్న కేసీఆర్.. ఆయన సతీమణి పేరిట 94 లక్షల 59వేల ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఆమె దగ్గర 2.2 కిలోల బంగారంతో పాటు విలువైన వజ్రాలు ఉన్నట్లు అఫిడవిట్ లో చూపించారు.

    అప్పులెంత?

    అప్పులెంత?

    ఆస్తులతో పాటు అప్పుల చిట్టా చూసినట్లయితే.. 8,88,47,570 (8 కోట్ల 88 లక్షలు) రూపాయల బాకీ ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు కేసీఆర్. కుమారుడు కేటీఆర్ నుంచి 82,82,570 (82 లక్షలు) .. కోడలు శైలిమ నుంచి 24,65,000 (24 లక్షల 65వేలు) అప్పు తీసుకున్నట్లు వివరించారు. 2014 ఎన్నికల సందర్భంగా 7 కోట్ల 87 లక్షల అప్పు చూపించిన కేసీఆర్ ఈసారి కోటి రూపాయలు అప్పు పెరిగినట్లు చూపించారు.

    వ్యవసాయ భూమి వివరాలు..

    వ్యవసాయ భూమి వివరాలు..

    2014 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో వ్యవసాయ భూమి 37.70 ఎకరాలు ఉందని చూపించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి గ్రామంలో ఉన్న ఆ భూమి విలువ 4 కోట్ల 50 లక్షలుగా లెక్కించారు. ఈసారి దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో 54.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పేరిట 48 ఎకరాలు, ఆయన సతీమణి పేరిట 6.24 ఎకరాలు ఉందని మొత్తం విలువ 6 కోట్ల 50 లక్షలు ఉంటుందని చూపించారు.

     కేసుల చిట్టా

    కేసుల చిట్టా

    తనపై నమోదైన కేసుల వివరాలు అఫిడవిట్ లో పొందుపరిచారు కేసీఆర్. మొత్తం 64 కేసులకు గాను రెండు మాత్రమే విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు. మరో 62 కేసులకు సమన్లు జారీ కాలేదని చూపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+