ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు: భట్టి విక్రమార్కకు కేసీఆర్ చురకలు, అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం ఇలా

హైదరాబాద్: ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే రాష్ట్రంలో పంచాయతీల నిధుల మళ్లింపుపైనా స్పందించారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. గ్రామ పంచాయ‌తీ నిధులపై శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్షాలు మాట్లాడిన తీరును ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ప్పుబ‌ట్టారు.

ఆ నిధులు మళ్లించడం లేదంటే కేసీఆర్ ఫైర్

ఆ నిధులు మళ్లించడం లేదంటే కేసీఆర్ ఫైర్

గ్రామ పంచాయ‌తీల నిధులు దారి మ‌ళ్లింపు అనేది స‌త్య‌దూరమని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశామ‌న్నారు. శాస‌న‌స‌భ‌లో స‌భ్యుల‌ మాట‌లు వింటుంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో జాలి ప‌డాల్సి వ‌స్తుంది. ఏది ప‌డితే అది అడ్డ‌గోలుగా మాట్లాడితే స‌రికాదన్నారు.

తెలంగాణ‌లోని స‌ర్పంచ్‌లు దేశంలోనే అత్యంత గౌర‌వంగా బ‌తుకుతున్నారు. గ‌ర్వంగా త‌ల ఎత్తుకునే స‌ర్పంచ్‌లు ఉన్నారంటే మ‌న వాళ్లే. మ‌న స‌ర్పంచ్‌ల‌ను కేంద్ర మంత్రులు ప‌లువురు ప్ర‌శంసించారు. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌ధాని, నీతి ఆయోగ్ కూడా ప్ర‌శంసించి అనేక అవార్డులు ఇచ్చింది. ముఖ్రా కే గ్రామానికి అవార్డు వ‌చ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో ఒక వ్యక్తిపై సగటున రూ. 4 ఖర్చు చేస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 650 ఖర్చు చేస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు.

ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదంటూ కేసీఆర్

ఎవరూ ఎవరి గొంతు నొక్కడం లేదంటూ కేసీఆర్

ఎవ‌రూ ఎవ‌రి గొంతు నొక్క‌డం లేదు. మీరు అద్భుతంగా మాట్లాడండి. మీ కంటే అద్భుతంగా మేం చెప్ప‌గ‌లుగుతాం. మ‌న ఇద్ద‌రి క‌న్న అద్భుతంగా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తారు. అనేక రాష్ట్రాల‌తో పోల్చుకున్న‌ప్పుడు త‌మ గ్రామాలు చూసి త‌న్మ‌యం చెంది పుల‌కించిపోతున్నారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచ్‌లు బాధ ప‌డ్డ మాట వాస్త‌వం. ఇవాళ బాధ‌ప‌డ‌టం లేదు. సంతోషంగా ఉన్నారు. గ‌ర్వ‌ప‌డుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. క‌రోనా లాంటి ఇత‌ర సంద‌ర్భాల్లో డ‌బ్బుల‌కు ఇబ్బంది వ‌స్తే అవ‌స‌రం అనుకుంటే శాస‌న‌స‌భ్యులు, మినిస్ట‌ర్ల జీతాలు ఆప‌మ‌న్నాను. కానీ, పంచాయ‌తీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్ద‌ని చెప్పాను. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వ‌స్తున్నాయో ప్ర‌తిప‌క్షాల‌కు తెలియ‌దా? ఫైనాన్స్ ఆఫ్ క‌మిష‌న్ ఇండియా చెప్పిన ప్ర‌కారం కేంద్రం నిధులు ఇస్తుంది. ప్ర‌త్యేకంగా కేంద్రం నుంచి వ‌చ్చే నిధులేమి ఉండ‌వు. ఇది వారి అవ‌గాహ‌న‌లోపం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం ద‌యాదాక్షిణ్యాల మీద నిధులు రావు. కొన్ని చోట్ల వ‌న‌రులు ఉంటాయి. కొన్ని చోట్ల వ‌న‌రులు ఉండవు. ఏజెన్సీ ఏరియాల్లో భూముల అమ్మ‌కాలు, కొనుగోళ్లు జ‌ర‌గ‌వు. అన్ని గ్రామ‌పంచాయ‌తీల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గాలంటే ఏం చేయాలో ఆలోచించాం. మేధావులు, మంత్రివ‌ర్గం ఆమోదం త‌ర్వాత పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని స‌భ ముందుకు తెచ్చాం. నిధుల దారి మ‌ళ్లింపు అనేది స‌త్య‌దూరమని మరోసారి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై కేసీఆర్ ఆశ్చర్యం, చురకలు

భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై కేసీఆర్ ఆశ్చర్యం, చురకలు

మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలపై కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్కకు సీఎం కేసీఆర్ చుర‌క‌లంటించారు. స‌ర్పంచ్‌ల విష‌యంలో భ‌ట్టి మాట్లాడుతుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచ్‌ల‌ను ప‌ట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత స‌ర్పంచ్‌ల‌కు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హ‌క్కులు క‌ల్పించామ‌న్నారు. శాస‌న‌స‌భ‌లో స‌భ్యులు స‌త్య‌దూర‌మైన విష‌యాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ‌ ప్ర‌గ‌తిపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ కాదు.. దీర్ఘ‌కాలిక చ‌ర్చ పెట్టండి అని స్పీక‌ర్‌కు సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. తాము అన్న‌ది త‌ప్ప‌కుండా చేసి చూపిస్తాం. ఏక‌గ్రీవ‌మైన గ్రామ‌పంచాయ‌తీల‌కు నిధులు ఇస్తామ‌ని ఎక్క‌డా చెప్ప‌లేదు. నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో ఆ ప్ర‌స్తావ‌నే లేదు. ఆ చ‌ట్టం ప్ర‌కారమే నిధుల పంపిణీ, విడుద‌ల జ‌రుగుతుంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప‌న్నులు వ‌సూలు చేసుకునే బాధ్య‌త‌ను పంచాయ‌తీల‌కే అప్ప‌గించాం. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో పంచాయ‌తీల్లో అవినీతి జ‌రిగింది. గ్రామాల్లో ప‌రిశుభ్ర‌త కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మ‌ర‌ణాలు సంభ‌వించేవి. ఇప్పుడు అన్ని సీజ‌న‌ల్ వ్యాధులు, డెంగీ లాంటి విష‌జ్వ‌రాలు త‌గ్గిపోయాయి. గ్రామాల రూపురేఖ‌ల‌ను మార్చేశామ‌ని సీఎం కేసీఆర్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+