షీర్డీలో సాయిబాబాను దర్శించుకొన్న తెలంగాణ సీఎం కెసిఆర్

షీర్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి షీర్డీ సాయిబాబాను దర్శించుకొన్నారు. ఇవాళ ఉదయం హైద్రాబాద్‌ నుండి కెసిఆర్ ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి షీర్డీకి వెళ్ళారు.

బేగంపేట విమానాశ్రయం నుండి కెసిఆర్ కుటుంబసభ్యులతో కలిసి హైద్రాబాద్‌ నుండి షీర్డీకి వెళ్ళారు. షీర్డీలో సాయిబాబాను దర్శించుకొన్న తర్వాత హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

Telangana Cm KCR visits Shirdi temple

సాయిబాబా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్వహకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో కేసీఆర్‌ కుటుంబ సమేతంగా సాయిబాబాను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మొక్కును పురస్కరించుకొని తెలంగాణ సీఎం కెసిఆర్ కుటుంబసభ్యులతో కలిసి షీర్డి సాయిబాబాను దర్శించుకొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కెసిఆర్ షీర్డీకి వెళ్ళడం ఇదే ప్రథమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+