తెలుగు స్టార్ హీరోలు, కేటీఆర్ కోసం సంచలన అధికారిని తెస్తున్న రేవంత్‌రెడ్డి!
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి సహకారం అందివ్వమని కోరుతుంటే ఎవరూ స్పందించడంలేదు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వీడియోలు చేసి విడుదల చేశారు. అంతకుమించి ఎవరూ ముందుకు రాలేదు. కొండా సురేఖ కేటీఆర్ ను విమర్శించే సందర్భంలో నాగార్జున కుటుంబాన్ని లాగడంతో సినీ పరిశ్రమ మొత్తం ఆమెపై తీవ్రంగా విమర్శల దాడికి దిగింది. వివాదాన్ని వదిలేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినప్పటికీ వారెవరూ వినలేదు. దీనిపై రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.
కేటీఆర్ వల్లే హీరోయిన్లు దూరమయ్యారు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. పరిశ్రమలో, హైదరాబాద్ నగరంలో రోజురోజుకు డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. టాలీవుడ్ పెద్దలను విచారించే క్రమంలో అప్పటి ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ను బదిలీ చేశారు. ఆయన్ను బదిలీ చేయడంతో డ్రగ్స్ కేసు మూలన పడింది. తిరిగి అకున్ సబర్వాల్ కే డ్రగ్స్ కేసును రేవంత్ అప్పగించబోతున్నారని సినీ, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల ప్రకారం సినిమాల్లోని హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ అని, వారి జీవితాలను ఆగం చేశారని, కేటీఆర్ వల్లే కొందరు హీరోయిన్లు వివాహం చేసుకొని పరిశ్రమకు దూరమయ్యారని కొండా సురేఖ ఆరోపించింది.

తెలిసిన సమాచారం ప్రకారం చెప్పా
తమదగ్గర ఉన్న సమాచారం ప్రకారం, బయటకు అందరికి తెలిసిన విషయాల ప్రకారం తాను చెబుతున్నానని మంత్రి స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును పూర్తిగా విచారించి అందులో భాగస్వాములుగా ఉన్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేసులో అకున్ సబర్వాల్ గతంలోనే ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఆయనకు దీనిపై పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు అకున్ రాకతో ఈ కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ప్రధానంగా బీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలతోపాటు, వారితో పరిచయాలున్న టాలీవుడ్ పెద్దలు, పరిశ్రమలో రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటున్నవారందరికీ ఇప్పుడు టెన్షన్ ప్రారంభమైనట్లేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications