ఢిల్లీకి సీఎం రేవంత్: కేబినెట్ విస్తరణతోపాటు ఈ కీలక అంశాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. శనివారం ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమి పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా రాహుల్‌ గాంధీని ఎన్నుకోవడంతో పాటు, ఆయనను కలిసి అభినందించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ముందు రోజే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి కానీ, శనివారం ఉదయం కానీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం సమావేశమై.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana CM Revanth Reddy left for delhi

శనివారం ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎంతో పాటు సభ్యురాలిగా దీపాదాస్‌ మున్షీ, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్‌ రెడ్డి, శాశ్వత ఆహ్వానితుడు దామోదర్‌ రాజనర్సింహులు హాజరు కానున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ ముగియడంతో రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పని చేసిన నాయకులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టే పనిలో పడింది.

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేసిన నాయకులు, ముఖ్య నేతలు పదవులు ఆశిస్తున్నారు. ఇంకొంత మంది శాసనసభ టికెట్లు ఆశించి, నిరాశకు గురైన నాయకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే, నలుగురు సలహాదారులతో పాటు టీ-శాట్‌ సీఈవో, ఆర్థిక కమిషన్‌ ఇలా కొన్ని నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. మరో 37 నామినేటెడ్‌ ఛైర్మన్‌ పోస్టుల భర్తీ కూడా లోక్​‌సభ ఎన్నికల ముందు జరిగింది.

అయితే, ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో వారెవరూ విధుల్లో చేరలేదు. గురువారంతో కోడ్​ ముగియడంతో గవర్నమెంట్ కార్యకలాపాలతో పాటు పాలనా వ్యవహారాలు కూడా శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. 100కు పైగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పోస్టులు ఉండగా, ఇప్పటి వరకు 50లోపే భర్తీ కాగా, మిగిలినవి భర్తీ చేయాల్సి ఉంది. అయితే, కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి ఎలాంటి నామినేటెడ్‌ పోస్టులు లేవని పీసీసీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+