మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు, పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై ఇలా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ డీఎస్పీ నళినికి ఆసక్తి ఉంటే ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని సీఎం రేవంత్ ఆదేశించారు. డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ శాఖపై సీఎం సమీక్షించారు.
పారదర్శకంగా, అవకతవకలు లేకుండా పోలీస్ పోలీస్ నియామకాలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటి వరకూ చేపట్టిన పోలీసు నియామకాలపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. వెంటనే హోంగార్డు నియామకాలు చేపట్టాలని సూచించారు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విధుల్లో హోంగార్డులను ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
తెలంగాణ కోసం నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేశారని.. ఆమెకు ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్. నళినికి అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి పోలీసు శాఖలో నిబంధనలు అడ్డు వస్తే.. ఇతర ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. నళినికి అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ నళిని తన ఉద్యోగాన్ని వదులుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ నియామకాలు జారీ
రాష్ట్రంలో ప్రభుత్వమార్పుతో ఐఏఎస్ అధికారుల పోస్టింగులపై విస్తృత చర్చ జరిగింది. తాజాగా మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు సంబంధించి పోస్టింగులు ప్రకటన జారీ అయ్యింది.
హన్మకొండ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా రాధికా గుప్తా, ములుగు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.శ్రీజనిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.గౌతమి, జనగాం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.పి.లలిత్ కుమార్, మహబూబాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా లెనిన్ వత్సల్, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్, వనపర్తి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా సంచిత్ గాంగ్వార్, జయశంకర్ భూపాలపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పి.కదిరవన్ నియమితులయ్యారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం











Click it and Unblock the Notifications