ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ: టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ నిర్వహించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్‌పీఎస్సీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతోపాటు నోటిఫికేషన్ వివరాలతో తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణ వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో విడుదలైన నోటిఫికేషన్లతో పరీక్ష తేదీలను మార్చనుంది. త్వరలో కొత్త పరీక్ష తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు, సెక్రటేరియట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో రైతుభరోసా పథకంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్‌పై సీఎం రేవంత్ సమీక్షించారు. నార్కోటిక్ అధికారులతో ఈ అంశంపై కీలకంగా చర్చించారు. డ్రగ్స్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, వాడకంపై గతంలో పలువురు సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ అంశంపై సీఎం రేవంత్ సమీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications