ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలపై అధిష్టానంతో చర్చిస్తా: కుంతియా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం రద్దుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించనున్నట్టు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ప్రకటించారు.

  రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్ధం

  తెలంగాణ అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మరో వైపు నల్గొండ, ఆలంపూర్ ఎమ్మెల్యలే శాసనసభసభ్యత్వాలను రద్దు చేశారు.

  Telangana Congress incharge khuntia slams Kcr government

  ఈ విషయమై మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తమ అభిప్రాయాన్ని చేరవేశారు.

  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు.అయితే ఈ విషయమై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress party Telangana incharge Khuntia said that I will discuss with party top leadership over Telangana Congress MLAs and MLCs resignations. He spoke to media on Wednesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి