ఉమ్మడిగా ఉన్నప్పుడే ఇచ్చారు: కెసిఆర్‌పై జానా
హైదరాబాద్/ మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లాలు పర్యటించేందుకే పదవిలోకి వచ్చినట్లున్నారని ప్రతిపక్ష నేత, కాగ్రెసు సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాల పర్యటననే కెసిఆర్ పనిగా భావిస్తున్నారని ఆయన ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హామీ ఇవ్వాలనుకుంటే హైదరాబాద్ నుంచి కూడా ఇవ్వవచ్చునని, అయినా కెసిఆర్ జిల్లాలు పర్యటిస్తున్నారని ఆయన అన్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రబీ పంటకు నీళ్లిచ్చే అంశంపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదని, రబీకి నీళ్లిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు

రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరందించారని, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన అన్నారు. కృష్ణపట్నం విద్యుత్తు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కెసిఆర్‌పై ఉందని జానా రెడ్డి అన్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అందించిన పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ విస్మరించారని బిజెపి సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన శనివారం నాగర్ కర్నూలు మండలం గుడిపల్లి వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలని ఆయన మంత్రులకు సూచించారు.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications