హైదరాబాద్ వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఎస్సై సహా 13 మంది మృతి, 26 మందికి సీరియస్

రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. చిన్నా పెద్దా అంతా కలిసి పోయిరా గణపయ్య అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా వీధుల్లో ఎక్కడ చూసినా అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నా భక్తులు మాత్రం ఉత్సాహం తగ్గకుండా గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఈ మేరకు డప్పు చప్పుళ్లు, డేజే హోరులు, యువతీ యువకుల నృత్యాలతో వీధులన్నీ మార్మోగాయి. ఇక సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి కావడంతో హైదరాబాద్ నగరంలో భారీగా గణేష్ విగ్రహాలు ట్యాంక్ బండ్ కు తరలివచ్చాయి. వేలాదిగా వచ్చి గణేష్ విగ్రహాలకు పటిష్టమైన భద్రత మధ్య పోలీసులు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేశారు. అటు హైదరాబాద్ లో ఫేమస్ అయిన ఖైరతాబాద్, బాలాపూర్‌ గణేషుడిని కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం పూర్తి చేశారు.

అయితే తెలంగాణలోని వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఒక ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 26 మంది గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూటౌన్‌ ఠాణాలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కే. వెంకన్న(57) గణేశ్‌ నిమజ్జన బందోబస్తు కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌ కు వచ్చారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ హామీ ఇచ్చారు. ఇక పరారీలో ఉన్న నిందితుడి కోసం సైఫాబాద్ పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

Telangana Deep tragedy during Vinayaka immersion across 13 dead including SI 26 critically injured

ఇక పఠాన్‌ చెరులో ఆరుగురు యువకులు గణేష్ నిమజ్జనంలో ప్రమాదవశాత్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఖైరతాబాద్‌ లో ఒకరు, నిర్మల్‌ లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి డీజే సౌండ్స్ కారణంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ మేరకు ఈ వివరాలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా వెల్లడించారు. మరోవైపు వినాయక చవితి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1.24 లక్షల వినాయక విగ్రహాలను మండపాల్లో ప్రతిష్టించారని వెల్లడించారు. ఇక ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్‌ మెంట్స్ లో కలిపి 3.5 లక్షల నుండి 4 లక్షల మధ్య వినాయకులు ప్రతిష్టించారని తెలిపారు. అలాగే ట్రాఫిక్‌ నిర్వహణతో పాటు భద్రతా చర్యలను కూడా పోలీసులు నిరంతరం పర్యవేక్షించినట్లు డీజీపీ వివరించారు. పోలీసులు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ నిమజ్జన వేడుకల సందర్భంగా జరిగిన దురదృష్టకర ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోవడం, 26 మంది గాయపడటం తీవ్ర విషాదాన్ని నింపిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+