Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాగార్జున తెలంగాణలో క్రియేటివ్ రంగాన్ని నడిపించాలి - భట్టి

తెలంగాణ సృజనాత్మక రంగ అభివృద్ధికి అక్కినేని నాగార్జున నాయకత్వం అవసరమని.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ మేరకు అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు దార్శనికతను గౌరవపూర్వకంగా స్మరించారు. 1970లలో మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లోనే ఫిల్మ్ స్టూడియోస్‌ను ఏర్పాటు చేసి.. తెలుగు చలనచిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడం ANR చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

ఏఎన్నార్ కి ఈ దూరదృష్టి లేకపోతే నేడు హైదరాబాద్ సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రాలేదని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా వంటి సంస్థలు నేటి సృజనాత్మక రంగానికి ఆలంబనగా నిలుస్తున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ANR స్థాపించిన ఈ సంస్థలు కళ, మీడియా, టెక్నాలజీ రంగాల్లో అసమాన సేవలు అందిస్తూ యంగ్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయని ఆయన అభినందించారు.

telangana-deputy-cm-bhatti-vikramarka-comments-on-nagarjuna

అలానే అక్కినేని నాగార్జునపై కూడా ప్రశంసలు కురిపించారు. పరిశ్రమలో ఉన్న అనుభవం, అంతర్జాతీయ పరిజ్ఞానం రాష్ట్రానికి కొత్త అవకాశాలను తీసుకురాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. కళల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

మరోవైపు అన్నపూర్ణ కాలేజ్ విద్యార్థులు రూపొందించిన 'రోల్ నెం. 52' అనే షార్ట్ ఫిల్మ్‌ను చూశానని భట్టి వెల్లడించారు. అది తనను ఎంతో ఆకట్టుకున్నదని తెలిపారు. కథ చెప్పే తీరు, భావోద్వేగాల ప్రదర్శన, సాంకేతిక నాణ్యత అన్ని బాగున్నాయని.. యువ దర్శకులు, టెక్నీషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ మార్గంలో సినిమా పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ సినిమా మార్కెట్‌లో తెలంగాణను ఒక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు చేపట్టిందని వివరించారు.

నాగార్జున ఏమన్నారంటే..

తన తండ్రి ANR నిర్మించిన వారసత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్ చేస్తున్న కృషిని నాగార్జున వివరించారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో నేడు అన్నపూర్ణ స్టూడియోస్ దేశంలోనే అత్యుత్తమ సినిమా కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. తన తండ్రి కల భవిష్యత్ కథకులను తయారు చేయడమని.. ఈ కాలేజ్ దాన్ని నెరవేర్చుతోందని ఆయన పేర్కొన్నారు.

telangana-deputy-cm-bhatti-vikramarka-comments-on-nagarjuna

ఇక ఈ సందర్శనలో భాగంగా ANR Sound & Vision భారతదేశంలో తొలి డాల్బీ సర్టిఫైడ్ ఫెసిలిటీ -ను ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇక్కడ ఉన్న సౌండ్ మిక్సింగ్, DI, కలర్ గ్రేడింగ్, అత్యాధునిక కెమెరా సెటప్‌లు, వర్చువల్ ప్రొడక్షన్ సదుపాయాలను మెచ్చుకున్నారు. ఇవి హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా ప్రొడక్షన్ మ్యాప్‌లో నిలబెట్టే సామర్థ్యం కలిగినవని అభిప్రాయపడ్డారు. సినిమా, మీడియా, యానిమేషన్, VFX, గేమింగ్ వంటి రంగాలలో తెలంగాణను ప్రపంచ కేంద్రంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని భట్టి విక్రమార్క తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+