Telangana DSC: రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో శుభవార్త. పాఠశాల విద్యకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లోనే నోటిఫికేషన్, విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.

విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేశామని మంత్రి తెలిపారు.
గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 5,310 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications