Barrelakka: మేనిఫెస్టో విడుదల, తగ్గేదేలే అంటున్న బర్రెలక్క

నాగర్‌ కర్నూల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క సంచలనంగా మారుతోంది. ఎన్ని డిగ్రీలు చదవినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని.. అందుకే బర్లు కాసుకుంటున్నానని వీడియో తీసి అప్పట్లో ఫేమస్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క.. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష తన వీడియోతో ప్రభుత్వానికి సవాల్ విసిరినట్లయింది. ఆ వీడియో ఆధారంగా అటు ప్రతిపక్షాలు, ఇటు నిరుద్యోగులు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు, శిరీషకు నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

telangana elections: Barrelakka releases manifesto

అప్పట్నుంచి శిరీషను.. బర్రెలక్కగా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగుల పక్షాన కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలోకి దిగారు. అంతేగాక, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు, యువత నుంచి కూడా ఆమెకు మద్దతు లభిస్తోంది. తాజాగా, ఆకట్టుకునేలా మేనిఫెస్టో విడుదల చేసి మరింత సంచలనంగా మారారు బర్రెలక్క.

బర్రెలక్క మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:

1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా

2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా

3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా

4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు

5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా

6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు - ఫ్రీ కోచింగ్

7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్.

బర్రెలక్క తమ్ముడిపై దాడి

కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) ఆమె తమ్ముడిపై కొందరు దుండగులు దాడి చేశారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు.

తన తమ్ముడిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని బర్రెలక్క కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రజల మద్దతు పెరగడంతో ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలా దాడులు చేయించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తన తమ్ముడిపై దాడి చేసి గాయపపర్చడం దుర్మార్గమంటూ భోరున విలపించారు.

నిరుద్యోగులకు న్యాయం జరగాలని తాము పోరాడుతున్నామని.. యువత, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బర్రెలక్క. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఆమె కోరారు.

దాడి ఘటనపై ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తామని బర్రెలక్క తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. నిరుద్యోగ యువత కోసం పోరాడుతామని కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క తెలిపారు. కాగా, ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి కూడా ఆమెకు మంచి స్పందన వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+