పుంజుకున్న బీజేపీ.. గోషామహల్, ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్,ఆదిలాబాద్, నిర్మల్ లో విజయం!!

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలు కెసిఆర్ కంచుకోటను బద్దలు చేశాయి. తెలంగాణ ప్రజలు ఈసారి చాలా విభిన్నమైన తీర్పుని ఇచ్చారు. రెండు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలు, మార్పును స్పష్టంగా కోరుకున్నారు. అది ప్రస్తుతం ఫలితాలలో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని భావించిన బిజెపి ఈ ఎన్నికలలో వెనుకబడింది. మూడవ స్థానానికి పరిమితమైంది.

అయినప్పటికీ కొన్ని స్థానాలలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు విజయం వైపు ప్రయాణం చేస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుత ఎన్నికలలో బిజెపి పుంజుకుందని చెప్పాలి. గతంలో కేవలం మూడు స్థానాలకే పరిమితమైన బిజెపి ఇప్పుడు కాస్త మెరుగ్గా ఫలితాలను నమోదు చేస్తుంది.

Telangana Elections: BJP Victory in Goshamahal, Armur, Nizamabad Urban, Adilabad, Nirmal!!

ఇప్పటివరకు బిజెపి ఖాతాలో పడిన స్థానాల వివరాల్లోకి వెళితే గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ హైదరాబాద్లో బిజెపి తొలి విజయం సాధించి ఖాతా తెరిచారు. గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి పై విజయాన్ని నమోదు చేశారు.

మరోవైపు నిజామాబాద్ అర్బన్ లో బిజెపి విజయ కేతనాన్ని ఎగురవేసింది. నిజామాబాద్ అర్బన్ లో బిజెపి అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ విజయాన్ని నమోదు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పైడి రాకేశ్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్‌పై బిజెపి అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలుపొందారు.

నిర్మల్ లో బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై విజయం సాధించారు. ఆదిలాబాద్ లోనూ బీజేపీ ఖాతా తెరిచింది. ఆదిలాబాద్ అసెంబ్లీలో బిజెపి అభ్యర్థి పాయల్ శంకర్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న పై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరో నాలుగు స్థానాలలో బీజేపీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ ఫలితాలు గతం కంటే మెరుగ్గా ఉంటే, తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలని భావించిన బిజెపికి ఆ అవకాశం లేకపోవడం నిరాశకు గురి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+