అది నా గ్యారంటీ: తెలంగాణలో నిరుద్యోగులతో రాహుల్ భేటీ (వీడియో)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాష్ట్రంలో పలుమార్లు పర్యటించి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై రాహుల్‌ గాంధీ స్పందించారు. 'దొరల' కేసీఆర్‌(KCR) సర్కార్‌ కింద తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల తాను హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో సెంట్రల్ లైబ్రేరీలో నిరుద్యోగులను కలిసినట్లు తెలిపారు రాహుల్ గాంధీ. అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి విపులంగా తెలుసుకున్నారని తన ఎక్స్(ట్వీటర్) వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఉద్యోగ కల్పన కోసం కాంగ్రెస్ సరైన విధానాన్ని తీసుకువస్తుందన్నారు.

telangana elections: Rahul gandhi met job seekers in hyderabad

నిరుద్యోగ యువత బాధను తగ్గించేందుకు తమ కాంగ్రెస్‌ 'ఉద్యోగ క్యాలెండర్'తో తొలి అడుగు ముందుకు వేసిందని రాహుల్​ గాంధీ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. యూపీఎస్సీ మాదిరి టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.

యువ వికాసం కింద విద్యార్ధులకు రూ.5 లక్షల సహాయం.. యువత భవిష్యత్తు కాంగ్రెస్ ప్రజా సర్కార్ చేతిలో భద్రంగా ఉంటుందని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన రాహుల్.. మరోసారి హైదరాబాద్ వస్తున్నారు.

హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ రోడ్ షో

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంల భాగంగా హైదరాబాద్ నగరంలో మంగళవారం రాహుల్ గాంధీ రోడ్ షోతోపాటు కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్, 12 గంటలకు నాంపల్లిలో రాహుల్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజిగిరి ఆనంద్ బాక్ చౌరస్తాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండటంతో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. సోమవారం ప్రియాంక గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+