రాజీనామా చేసిన కేసీఆర్: నో సెక్యూరిటీ.. నో ఎస్కార్ట్: సాదాసీదాగా ఫామ్‌హౌస్‌కు: ఓటమితో కలత
KCR resign: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని అన్నారు.
ఈ ఎన్నికల్లో అధికార భారత్ రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 38 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్‌కు అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ఓటర్లు.. ఈ సారి మాత్రం బీఆర్ఎస్‌ను తిరస్కరించారు. 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఓటు రూపంలో బయటపడింది. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే- చివరికి కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ సైతం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక్కడ మూడో స్థానంలో నిలిచారు గులాబీ బాస్.
బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు తెలంగాణ ఓటర్లు. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఘన విజయాన్ని అందించారు. ఈ సారి ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశాన్ని ఇచ్చారు. మొత్తంగా 66 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ ప్రభంజనం ముందు ఆరుమంది మంత్రులు సైతం మట్టికరిచారు.
తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనక చంద్రబాబు హస్తం ఉందని భావిస్తున్నారా ..??#Chandrababu #RahulGandhi #RevanthReddy #TelanganaAssemblyElectionResults2023 #ElectionResults #ElectionResults2023 #AssemblyElections2023 #ResultsWithOneindia #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) December 3, 2023
ఈ పరిణామాల మధ్య కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. రాజ్‌భవన్‌కు వెళ్లలేదు కేసీఆర్. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పీ రాజశేఖర్ రెడ్డి.. రాజ్ భవన్‌కు వెళ్లి కేసీఆర్ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు.
రాజీనామా పత్రాన్ని రాజ్ భవన్‌కు పంపించిన కొద్దిసేపటికే కేసీఆర్.. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. రెండు కార్లల్లో సాదాసీదాగా వెళ్లిపోయారాయన. ఆయన వెంట ఎస్కార్ట్ గానీ.. సెక్యూరిటీ గానీ లేదు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఫామ్ హౌస్‌కు వెళ్లారు.












Click it and Unblock the Notifications