Funds for Telangana: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. నిధుల విడుదలకు ఆమోదం

Funds for Telangana: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్ న్యూస్ అందించింది. జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ "రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి పథకం(SASCI)"కింద తెలంగాణకు రూ.176.5 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద నిర్దేశించిన మైలురాయిని సాధించినందుకు రాష్ట్రాలు ప్రోత్సాహక మొత్తాన్ని పొందేందుకు అర్హులు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రోడ్డు రవాణా శాఖ అదనపు ప్రోత్సాహక సహాయం అందించింది. తెలంగాణ ఈ పథకం ద్వారా మైల్ స్టోన్ 1లో రూ.51.5 కోట్లు , మైల్ స్టోన్ 2లో రూ.125 కోట్లకు అర్హత పొందింది.

అంతే కాకుండా.. మోటార్ వెహికల్ ట్యాక్స్ కన్సెషన్ పథకం కింద తెలంగాణ రూ.50 కోట్లు అర్హత సాధించింది. మైల్ స్టోన్ -2 కింద రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు పైబడిన రవాణా వాహనాలను తొలగించేందుకు స్క్రాపింగ్ ప్రణాళికను పంపించింది. ఈ స్క్రాపింగ్ పథకంతో మరో రూ.75 కోట్లు అర్హత సాధించింది. రాష్ట్రంలోని మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకుని పని చేయడం ద్వారా తెలంగాణ రూ.31.5 కోట్లు అర్హత పొందింది. ప్రాధాన్యత లేని జిల్లాలకు రూ.20 కోట్లు పొందేందుకు అర్హత పొందింది. ఈ మైలురాయి కింద మొత్తం అర్హత కలిగిన ప్రోత్సాహకం రూ.51.5 కోట్లు. ఈ ఆర్థిక సాయం రాష్ట్రంలో రవాణా రంగం అభివృద్ధికి ఉపయోగపడనుంది.

Telangana Gets Approval for Release of Rs 176 5 Crore Under Special Financial Scheme

ఇంతలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HAM) కింద రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి అనుసంధానించే లింక్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానితో అనుసంధానించే రోడ్లు, ప్రస్తుత రహదారి మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ అనే మూడు విభాగాలుగా వర్గీకరించబడిన పనులను చేపట్టడంలో నియమాలను పాటించాలని మంత్రి అధికారులను కోరారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HAM) కింద రోడ్లకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయడానికి కన్సల్టెంట్లను గుర్తించాలని ఆదేశించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HAM) కింద చేపట్టిన రోడ్ల పురోగతిని సమీక్షించడానికి సీనియర్ ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశమైన మంత్రి.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+