Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ప్రేమ' పేరుతో శారీరకంగా దగ్గరయ్యి!: తెలంగాణ అమ్మాయికి ఆంధ్రా టెక్కీ మోసం

బెంగుళూరు వెళ్లాక అక్కా-బావ ఇంట్లో ఆమెను ఉంచాడు. అక్కడ ఆమెతో పలుమార్లు లైంగిక కోరిక తీర్చుకున్నాడు. పెళ్లి విషయం ఎటూ తేల్చకపోవడంతో యువతి మళ్లీ వరంగల్ వెళ్లిపోయింది.

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మొదలయ్యే ప్రేమలు మధ్యలోనే లైన్ తప్పి చివరాఖరికి విషాదాలుగా మిగులుతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో బాధిత యువత ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వినయ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా 2015లో వరంగల్‌కు చెందిన ఓ యువతితో వినయ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నంబర్లు మార్చుకున్న ఇద్దరు ఫోన్ ముచ్చట్లలో మునిగితేలారు.

telangana girl cheated by andhra software engineer in bengaluru

ఫోన్ వ్యవహారం ఎన్నాళ్లు!.. ఒకసారి డైరెక్టర్‌గా కలవాలని వినయ్ అడగడంతో యువతి బెంగుళూరులో వాలిపోయింది. 2016 డిసెంబర్‌లో బెంగుళూరు వెళ్లిన ఆ యువతిని తన గదికి తీసుకెళ్లి వినయ్ శారీరకంగా అనుభవించాడు. ఆ తర్వాత ఆమె తిరిగి వరంగల్ వెళ్లిపోయింది. మధ్యలో కొన్నిసార్లు బెంగుళూరు వచ్చి వెళ్లడం వినయ్ ఆమెతో తన లైంగిక వాంఛను తీర్చుకోవడం జరుగుతూ వస్తున్నాయి.

ఇదే క్రమంలో ఓరోజు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటాను మాట్లాడుకుందాం రా.. అంటూ యువతిని నమ్మించాడు. యువతి బెంగుళూరు వెళ్లాక అక్కా-బావ ఇంట్లో ఆమెను ఉంచాడు. అక్కడ ఆమెతో పలుమార్లు లైంగిక కోరిక తీర్చుకున్నాడు. పెళ్లి విషయం ఎటూ తేల్చకపోవడంతో యువతి మళ్లీ వరంగల్ వెళ్లిపోయింది.

ఇంతలోనే వినయ్ వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలియడంతో.. గత ఫిబ్రవరి నెలలో అతని తల్లిదండ్రులను కలుసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో తమ కుమారుడికి రూ.16లక్షల కట్నం ఇచ్చే సంబంధం వచ్చిందని, అంత కట్నం ఇచ్చుకుంటేనే పెళ్లి జరిపిస్తామని తేల్చి చెప్పారు.

ఇదే విషయం వినయ్ కు చెబితే బెంగుళూరుకి రావాలని సూచించాడు. నమ్మి అక్కడిదాకా వెళ్లిన యువతికి తీరా వినయ్ కనిపించకపోవడంతో షాక్ తిన్నట్లయింది. అగ్రహారలోని అతని అక్కా-బావ ఇంటి వద్దకు వెళ్లగా.. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాల్సిందిగా కోరింది. తనను మోసం చేసిన వినయ్ కు కఠిన శిక్ష పడేంతవరకు తాను పోరాడుతానని ఆవేదనతో చెప్పింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+