తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి ప్రతినెలా రూ. 5 వేలు..!

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి ఉచిత కోచింగ్ అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇప్పించడంతోపాటుగా అభ్యర్థులకు ప్రతినెలా రూ. 5 వేలు అందించనుంది. అలాగే లైబ్రరి వసతి కూడా కల్పించనుంది. మరి దీనికి ఎవరు అర్హులు..? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది..? పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2027 కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్ లో ఉచిత కోచింగ్ కార్యక్రమం నిర్వహించనుంది. అభ్యర్థులకు కోచింగ్ సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు 2026 ఆగస్టు 24 నుంచి 2027 మే వరకు కోచింగ్ అందించనున్నారు. ఇక అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 150 మందికి ఈ కోచింగ్ ను అందించనున్నారు. రాత పరీక్ష ద్వారా 100 మందిని అలాగే ఇదివరకే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 50 మందికి అవకాశం కల్పించనున్నారు.

Telangana Good news for unemployed youth in the stateFree UPSC Civil Services coaching for students

ఇక అర్హతలు చూస్తే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం చూస్తే గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలలోపు.. అలాగే పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షల లోపు ఉండాలి. అలాగే ప్రస్తుతం ఏ ఉద్యోగం కానీ, ఇతర విద్యా కోర్సులు అభ్యసించడం కానీ చేయకూడదు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జూలై 15, 2026 న విడుదల కానుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 7 వరకు ఉంటుంది. హాల్ టికెట్స్ ఆగస్టు 13 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆగస్టు 16 న ఉంటుంది. ఫలితాలు ఆగస్టు 19 న విడుదల కానున్నాయి. ఇక తరగతులు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q