20 సార్లు తిరిగితే రూ 50 లక్షలు: టీజీ వెంకటేష్ పేరును ప్రస్తావించిన హరీష్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ పేరును తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రస్తావించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎంపీ టీజీ వెంకటేష్ పేరును తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రస్తావించారు. సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హరీష్‌రావు టీజీ వెంకటేష్ పేరును ప్రస్తావించారు.
సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రస్తావన వచ్చింది. మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ సంఘటనను సభ్యులకు వివరించారు.

"గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీజీ వెంకటేష్ మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉండేవారు..శంకర్రావు కూడా అప్పట్లో మంత్రిగా ఉన్నారు కానీ మా నియోజకవర్గానికేమో ఒక కాలువలేదు. ఆ కాలువ కోసం టీజీ ఆఫీసు చుట్టూ తిరుగివాడినని ఆయన గుర్తు చేసుకొన్నారు. మంత్రి టిజీ వెంకటేష్ కార్యాలయం చుట్టు 20 చక్కర్లు కొడితే రూ. 50లక్షలు వస్తుండేవని ఆయన గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు రోజులు మారాయి ఇవాళ మీరు ఎవరైనా అడిగారా మాకు ఒక్కరైనా దరఖాస్తు ఇచ్చారా?" అని ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఆయన అడిగారు. దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని చెరువులు, అన్ని ప్రాజెక్టులను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఘనత టీఆర్ఎస్‌దే అని మంత్రి హరీష్ చెప్పారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications