Holiday: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Holiday: త్వరలోనే హోళీ పండుగ రాబోతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందంగా జరుపుకునే ఈ పండుగ గురించి ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హోళీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు హోళీ పండుగకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రంగుల పండుగగా జరుపుకునే ప్రసిద్ధ, ముఖ్యమైన హిందూ పండుగ అయిన హోళీకి తెలంగాణ సర్కారు సెలవు ప్రకటించింది.తెలంగాణ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం హోలీకి సాధారణ సెలవు ప్రకటించింది.

దీనిని రంగుల పండుగ, వసంత పండుగ, ప్రేమ పండుగ అని కూడా పిలుస్తారు.తెలంగాణతో సహా భారతదేశం అంతటా హోలీ పండుగను గొప్పగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ రంగులలో మునిగి తేలుతారు. భారత్ లో వసంతకాలం రాకం, శీతాకాలం ముగింపును కూడా హోలీ సూచిస్తుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది.

Telangana Government Announces Public Holiday for Holi Festival

మార్చి నెలలో మరో నాలుగు సెలవులు కూడా ఉన్నాయి. వాటిలో రెండు సాధారణ సెలవులు కాగా.. మిగిలినవి ఆప్షనల్ హాలిడేస్. మార్చి 21న హజ్రత్ అలీ షహదత్, మార్చి 28న జమాత్ ఉల్-విదా కారణంగా ఆప్షనల్ సెలవు ఉంటుంది. హిందూ ముస్లింలకు ముఖ్య పండుగలు కూడా ఈ నెలలోనే ఉన్నాయి. అవి ఉగాది, రంజాన్ పండుగలు. ఈ పండుగలకు సాధారణ సెలవు ఉంటుంది. మార్చి 30న ఉగాది, మార్చి 31వ తేదీన రంజాన్ పండుగలు వరుసగా వస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు పండుగ చేసుకోవచ్చు. మార్చి నెలలో ఆదివారాలు, రెండో శనివారాలు కలిపి 9 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.

మార్చిలో సెలవుల లిస్ట్ ఇదే..

మార్చి 14 : హోలీ పండుగ సందర్భంగా ఈ రోజు సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా కోట్ల మంది జరుపుకునే ముఖ్యమైన పండుగ. రంగులతో ఘనంగా జరుపుకుంటారు.

మార్చి 30: ఉగాది అనేది తెలుగు సంవత్సరాది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రజలకు నూతన సంవత్సరం. దీన్ని యుగాది అని కూడా పిలుస్తారు. తెలుగు క్యాలెండర్ లో చైత్రమాసం మొదటి రోజు జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ వసంతకాలం రాకను సూచిస్తుంది.

మార్చి 31: ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) రంజాన్ నెల ముగింపును సూచించే ముఖ్యమైన ఇస్లామిక్ ఫెస్టివల్. ఈ పండుగ రోజున ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దానధర్మాలు చేస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+