School Holiday: ఫిబ్రవరి 14న స్కూల్స్ కు సెలవు.. ఎందుకంటే?
School Holiday: షబ్-ఎ-బరాత్ సందర్భంగా తెలంగాణ సర్కారు ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్ లో ఎనిమిదవ నెల అయిన షాబాన్ 15వ తేదీన జరుపుకునే షబ్-ఎ-బరాత్ కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తన క్యాలెండర్ లో ఫిబ్రవరి 14న షబ్-ఎ-బరాత్ కు సెలవు ప్రకటించినప్పటికీ.. దానిని సెలవుదినంగా కాకుండా ఆప్షనల్ హాల్ డే కింద చేర్చింది. షబ్-ఎ-బరాత్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రోజు. చంద్రుడు ఇప్పటికే కనిపించినందున వచ్చే శుక్రవారం(ఫిబ్రవరి 14) సెలవు దినంగా పాటించనున్నారు.
షబ్-ఎ-బరాత్
"క్షమాపణ రాత్రి" అని కూడా పిలువబడే షబ్-ఎ-బరాత్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం వేళల్లో చాలా మంది తమ ప్రియమైన వారి సమాధులను సందర్శిస్తారు. కొందరు షబ్-ఎ-బరాత్ రోజున ఉపవాసం ఉంటారు.

షబ్-ఎ-బరాత్ సందర్భంగా తెలంగాణలో కొన్ని పాఠశాలలు మాత్రమే సెలవును పాటిస్తాయి. ఫిబ్రవరి 14 సాధారణ సెలవుదినం కానప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు వచ్చే శుక్రవారం మూసివేయబడతాయి.ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం మూడు సెలవులను పాటించబోతోంది. ఒకటి సాధారణ సెలవు దినం కాగా.. రెండు ఆప్షనల్ హాలిడేలు ఫిబ్రవరి లో ఉన్నాయి.
ఫిబ్రవరిలో సెలవుల జాబితా
ఆప్షనల్ హాలిడేస్ ఏంటంటే.. వసంత పంచమి (ఫిబ్రవరి 3), షబ్-ఎ-బరాత్ (ఫిబ్రవరి 14) కాగా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ఒక సాధారణ హాలిడే ఉంది. శివరాత్రి రోజున పాఠశాలలకు సెలవు ఇవ్వబడుతుంది. సాధారణంగా, తెలంగాణలోని మైనారిటీ విద్యా సంస్థలు షబ్-ఎ-బరాత్ తర్వాత రోజు సెలవును పాటిస్తాయి.












Click it and Unblock the Notifications