తెలంగాణ సర్కారు తీపికబురు.. గణేష్, దుర్గా దేవి మండపాలకు ఫ్రీ కరెంట్ !
తెలంగాణ ప్రభుత్వం వినాయక చవితి, దసరా పండగలను పురస్కరించుకొని తీపి కబురు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గణేష్, దుర్గా దేవి మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే వినాయక నవరాత్రులకు.. అలాగే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే దుర్గా నవరాత్రులకు ఈ ఉచిత విద్యుత్ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అనుమతి పొందిన నిర్వాహకులందరికీ ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వలన వేలాది ఉత్సవ కమిటీలకు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతోమందికి లబ్ధి చేకూరనుంది.

ఇక మరోవైపు హైదరాబాద్ దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. డీజేలు, బాణసంచా కాల్చడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జన యాత్రలను వీలైనంత త్వరగా ప్రారంభించి, పోలీసులకు సహకారం ఇవ్వాలని కోరారు.
పోలీసులు సూచనలు..
- విద్యుత్ శాఖ అనుమతి కూడా తప్పనిసరిగా పొందాలి.
- నిపుణుల సేవలను ఉపయోగించి మండపాల ఏర్పాటు చేయాలి.
- ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్లను పూర్తిగా మూసివేయరాదు.
- శబ్ద పరిమితులు & అగ్నిప్రమాద నియంత్రణ
- రాత్రి 10 గంటల తర్వాత మైకులు వాడకంపై నిషేధం విధించబడింది.
- ప్రభుత్వం నిర్ణయించిన శబ్ద పరిమితిని కచ్చితంగా పాటించాలి.
- ప్రతి మండపంలో సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
- అగ్నిప్రమాద నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి.
- డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.
- భక్తులు మరియు సందర్శకులు మండపాల పరిధిలో రద్దీ పరిస్థితులను గమనించి జాగ్రత్తగా ఉండాలి.
- పార్కింగ్, మోటార్ వాహనాల ఏర్పాట్లు ముందస్తుగా చేయాలి.












Click it and Unblock the Notifications