తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: రూ. లక్ష లోపు రుణాల మాఫీ పూర్తి
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందురోజే రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు(రూ. 99,999) రుణమాఫీ చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు నెల 2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆగస్టు 3 నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రుణమాఫీలో ప్రక్రియ 3న ప్రారంభం కాగా.. తొలిరోజు రూ.41వేల లోపు 62,758 మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
విడుదల వారీగా రైతుల రుణాలను మాఫీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. మిగతా రైతుల రుణాలను సోమవారం ఒకేసారి రూ.99,999 లోపు ఉన్న 10.79లక్షల మంది రైతుల రూ.6,546.05కోట్లను మాఫీ చేసింది. ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్‌కు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన
ఆగస్టు 19, 20 తేదీల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈనెల 19వ తేదీన (శనివారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
ఈ నెల 20వ తేదీన (ఆదివారం) ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటన చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభంకానుంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications