హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో 86వేల పోస్టుల ఖాళీలు: 55వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం, త్వరలోనే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భ‌ర్తీ చేయనుంది. రాష్ట్రంలో అన్ని శాఖ‌ల్లో 86 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. అయితే, ఇందులో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోను.. 55వేలకు పైగా పోస్టులను వరుస నోటిఫికేషన్లలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక నుంచి ఖాళీలు ఏర్పడ్డ 6 నెల‌ల్లో ఉద్యోగాలు భ‌ర్తీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉద్యోగుల విభజనలో భాగంగా సోమవారం కీలక సమావేశం జరిగింది. విభజన కమిటీ సమావేశానికి మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌, పశుసంవర్దక, స్త్రీ, శిశు సంక్షేమ, ఇరిగేషన్‌, వాణిజ్య పన్నుల అధికారులు హాజరై 16 శాఖల్లో 2వేల 500 మంది ఉద్యోగుల విభజన పూర్తి చేశారు.

 Telangana government has decided to fill the job vacancies.

ఖాళీల గుర్తింపులో కసత్తులు చేసిన అధికారులు తుది నివేదికను రూపొందించారు. ఇందులో హోంశాఖలో 21వేల 507 పోస్టులు, విద్యా శాఖలో 22వేలు, వైద్యఆరోగ్య శాఖలో 10వేల 048 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో 3వేల 538, గిరిజన సంక్షేమ శాఖలో 1700, గ్రామీణాభివృద్ధి శాఖలో 1391 పోస్టులు, ఇతర ఖాళీలతో కలుపుకుని మొత్తంగా 86వేల 747 ఖాళీలు ఉన్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ, మంత్రివర్గ ఆమోదానికి పంపింది.

ఈ ఫైలుపై కేబినెట్‌ ఆమోదం తర్వాత జరిపే భర్తీలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను మినహాయించి ప్రత్యక్ష నియామకాల ద్వారా ఏర్పడిన 55వేలకు పైగా ఉద్యోగాల భర్తీ దిశగా సన్నాలు చేస్తోంది. ఈ దిశలో ప్రభుత్వ విభాగాలు, సర్వీస్‌ రూల్స్‌, రోస్టర్‌, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను, నియామక రూల్స్‌ వంటి వాటిని ఆయా నియామక ఏజెన్సీలకు అందించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించనున్నారు.వరుసగా పలు దఫాల్లో 55వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని యోచిస్తోంది. ఉద్యోగాల భర్తీ పై ఉన్న అసంతృప్తిని ఈ నోటిఫికేషన్‌ ద్వారా పూరించాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది.

English summary
Telangana government has decided to fill the job vacancies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X