నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ స‌ర్కారు.. 2,280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్న‌ల్‌..

నిరుద్యోగుల‌కు తెలంగాణ ప్రభుత్వం ఓ శుభ‌వార్త‌ను అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2,280 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స‌ర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల‌ల్లో బోధనా,బోధనేతర సిబ్బంది కొరతను రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్తించింది.

దీంతో వెంట‌నే తాత్క‌లిక ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. రాష్ట్రంలోని పలు జూనియర్ క‌ళాశాల‌ల్లో 1654 గెస్ట్ లెక్చరర్లు, 449 కాంట్రాక్ట్, 96 పార్ట్ టైమ్, 78 ఔట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి ప్ర‌భుత్వం అమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు అంటే మార్చి 31, 2025 వరకు మాత్రమే ఈ నియామయం ద్వారా కాలేజీల్లో బోధించేందుకు ఇంట‌ర్ క‌మిష‌న‌రేట్ నియామాకాలు చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు త్వ‌ర‌లో నియామ‌క ప్ర‌క్రియ‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది.

Telangana government has given good news to the unemployed Green signal for filling 2 280 jobs

తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటైన మూడు మాసాల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువ‌త‌కు భరోసా ఇచ్చారు. యువతలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు వారి ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని అన్నారు. అందుకోసం త‌గిన ఏర్పాట్లు కూడా చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+