ఆర్టీసీలో ఉచిత ప్రయాణం... పురుషులకు భారీ శుభవార్త

రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది. దీనివల్ల బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగి పురుషులకు కూర్చోవడానికి అవకాశం లేకుండా పోయింది. దాదాపుగా బస్సుల్లో ప్రయాణించే పురుషుల్లో 60 శాతం మంది నిలబడే ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది.

కొత్త బస్సుల ద్వారా ఉద్యోగాల కల్పేన
ఆర్టీసీ బస్సుల్లో ఎంత రద్దీ ఉన్నా కూర్చొని ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనివల్ల పురుషులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని, వారు సాఫీగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఆర్టీసీ బస్సుల్లో తీవ్రమైన రద్దీ పెరుగుతుండటంతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే మరిన్ని కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయని, అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకునే మెరుగైన రవాణా వసతి కల్పిస్తున్నామని, అలాగే 3035 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త బస్సులు అందుబాటులోకి రానుండటంవల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.

Telangana government is making arrangements to allow gents to travel sitting in RTC buses

రెండు రాష్ట్రాల నుంచి స్ఫూర్తి పొందిన ఏపీ
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని చూసి తాను కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పథకాన్ని ప్రారంభించారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి స్ఫూర్తి పొందిన తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల హామీలో ఇదే పథకాన్ని అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చింది. అక్కడ కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో వచ్చేనెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+